English | Telugu
రాజమౌళి ఛారిటీ ని బయటపెట్టిన రామ్ గోపాల్ వర్మ.. ఎవరెవరికి ఇచ్చాడో కూడా తెలుసు
Updated : Sep 11, 2024
రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)దర్శకుడుగా ఎంత పేరు సంపాదించాడో, తన విలక్షణమైన మాట తీరుతో కూడా అంతే పేరు సంపాదించాడు. కొన్ని సార్లు ఆ మాట తీరు వివాదాస్పదమైన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో దర్శక ధీరుడు రాజమౌళి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచాయి.
రాజమౌళి(rajamouli)వల్ల చాలా మంది నిర్మాతలు నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆయనలా పాన్ ఇండియా లెవల్లో సినిమా నిర్మించాలని భారీగా డబ్బు ఖర్చు చేసి ఆ తర్వాత డబ్బులు మొత్తం పోగొట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎవరు ఆలోచించని విషయం ఏంటంటే ఆ డబ్బు మొత్తం నిర్మాత ఎవరకి ఇస్తున్నాడు. సినిమాకి పనిచేసే టెక్నీషయన్స్ కి ఇస్తున్నాడు. అంటే ఒక నిర్మాత ఎన్నో ఏళ్లుగా కూడగట్టుకొని ఉన్న డబ్బుని రాజమౌళి తనకి తెలియకుండానే ఒక చారిటీ లాంటిది ఏర్పాటు చేసి సినిమా వాళ్ల జేబుల్లోకి వెళ్లేలా చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు.
అలాగే మరో దర్శకుడు హరీష్ శంకర్(harish shankar)మీద కూడా తన దైన స్టైల్లో సెటైర్ వేసాడు. రైడ్ అనే హిందీ రీమేక్ ని మిస్టర్ బచ్చన్ గా తెరకెక్కించే బదులు తన గత చిత్రం మిరపకాయ్ కి సీక్వెల్ గా కాకరకాయ అనే టైటిల్ తో సినిమా తీసిన సక్సెస్ కొట్టి ఉండే వాడని చెప్పుకొచ్చాడు.