English | Telugu

రామ్ చరణ్ "అగ్నిపథ్" రీమేక్ చేస్తాడా...?

రామ్ చరణ్ "అగ్నిపథ్" రీమేక్ చేస్తాడా...? వివరాల్లోకి వెళితే హిందీలో హృతిక్ రోషన్, సంజయ్ దత్ తదితరులు నటించగా ఇటీవల విడుదలైన "అగ్నిపథ్" చిత్రం సూపర్ హిట్టయ్యింది. ఈ "అగ్నిపథ్" చిత్రాన్ని మన యువ హీరో, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ చూశారు. ఈ "అగ్నిపథ్" చూసిన అనంతరం రామ్ చరణ్ స్పందిస్తూ "హృతిక్ రోషన్ నటన అద్భుతంగా ఉంది. హేట్సాఫ్ టు హృతిక్ రోషన్. ఈ సినిమాలో చూపించిన విధంగా హై వోల్టేజ్ ఎమోషన్స్, యాక్షన్ నేనింతవరకూ ఏ సినిమాలోనూ చూడలేదు" అని అన్నారు.

అన్నట్టు ఇక్కడ మీకో విషయం చెప్పాలి. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కి రామ్ చరణ్ తేజ హార్డ్ కోర్ ఫ్యాన్. అందుకనే ఈ "అగ్నిపథ్" చిత్రం గురించి అంతబాగా స్పందించారు. ఆయనకి ఈ "అగ్నిపథ్" చిత్రం ఎంత బాగా నచ్చిందంటే దీన్ని తెలుగులో ఎవరన్నా నిర్మించే ప్రయత్నం చేస్తే నటించటానికి తానే ముందుకొస్తాడేమో అన్నంతగా నచ్చింది. ఒకవేళ తానే ఈ "అగ్నిపథ్" చిత్రాన్ని స్వయంగా తెలుగులో తీసినా తీయవచ్చు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.