English | Telugu

ర‌కుల్‌.. మ‌రీ ఇంత సాహ‌స‌మా?

గ్లామ‌ర్ డాల్ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ మన క‌థానాయిక‌లు. అందాలు ఆర‌బోసే పాత్ర‌లైతే.... క్యూ క‌ట్టేస్తారు. అయితే అప్పుడ‌ప్పుడూ అవార్డుపై ఆశ‌తో డీ గ్లామ‌ర్ పాత్ర‌లు పోషిస్తుంటారు. అయితే ఇది ఒక ర‌కంగా సామ‌స‌మే. డీ గ్లామ‌ర్ రోల్ ఏమాత్రం గాడి త‌ప్పినా కెరీర్‌కే ముప్పు. అటు అవార్డూ రాదు. ఇటు కెరీర్ కూడా ఉండ‌దు. అయితే ర‌కుల్ ఇప్పుడు అలాంటి సాహ‌స‌మే చేయ‌బోతోంది. ఓ సినిమా కోసం అంగ‌వైగ‌ల్యం ఉన్న అమ్మాయిగా క‌నిపించ‌బోతోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘బెంగుళూరు డేస్’. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ర‌కుల్‌కు ఓ పాత్ర ద‌క్కింద‌ట‌. మ‌ల‌యాళంలో పార్వ‌తీ నాయ‌ర్ చేసిన పాత్ర‌లో ర‌కుల్ క‌నిపించ‌బోతోంది. పార్వ‌తి పాత్ర స్పెష‌ల్ ఏంటంటే.. అందులో ఆమె ఫిజిక‌ల్లీ హ్యాండీ కాప్ట్‌గా క‌నిపించింది. ఇప్పుడు ఆ సాహ‌సం ర‌కుల్ చేస్తోంద‌న్న‌మాట‌. పండగ చేస్కో, కిక్ 2, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ సినిమాల‌తో బిజీగా ఉంది ర‌కుల్‌. మ‌రి ఈ చిత్రానికి కాల్షీట్లు ఎలా కేటాయిస్తుందో చూడాలి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.