English | Telugu

విచిత్రంగా రజనీకాంత్ వెబ్ సైట్

విచిత్రంగా రజనీకాంత్ వెబ్ సైట్ తయారయ్యింది. విచిత్రం అని ఎందుకన్నానంటే ఎవరన్నా తమ వెబ్ సైట్ ఇంటర్నేట్ లో ఉండాలనుకుంటారు. అసలు ఇంటర్నెట్ లేకుండా ఇంతవరకూ ఏ వెబ్ సైట్ లేదు కూడా. కానీ రజనీకాంత్ అభిమానులు www.allaboutrajani.com అనే వెబ్ సైట్ ని రూపొందించారు. ఒకవేళ మీ కంప్యూటర్ కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీరు ఆ వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే మీకో మెస్సేజ్ వస్తుంది.

ఆ మెస్సేజ్ ఇలా ఉంటుంది "Aiyyo! That was unexpected. To keep browsing, switch off your internet". మీరు కనుక ఇంటర్నెట్ కనెక్షన్ తీసేస్తే వెంటనే ఆ వెబ్ సైట్ చూడొచ్చు. ఈ వెబ్ సైట్ ని ఇప్పటికే వేలాదిమంది చూశారు...ఇంకా కొన్ని వేలమంది చూస్తున్నారు. ఏది ఏమైనా వెబ్ సైట్ రూపొందించటంలో కూడా టిపికల్ రజనీ కాంత్ మార్క్, స్టైల్ కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి కదూ...! దటీజ్ రజనీ...!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.