English | Telugu

యన్.టి.ఆర్ "దమ్ము" పవర్

యన్.టి.ఆర్ "దమ్ము" పవర్ ఎలా ఉందంటే దుమ్ము దులిపేస్తోంది. వివరాల్లోకి వెళితే క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు సమర్పణలో,యంగ్ టైగర్ యన్.టి.ఆర్. హీరోగా, త్రిష, కార్తీక హీరోయిన్లుగా, డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో, యువ నిర్మాత అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"దమ్ము". ఈ చిత్రం బిజినెస్ పరంగా అద్భుతాలు సృష్టిస్తుందని సినీ పండితులంటున్నారు. దానికి తగ్గట్టే "దమ్ము" నైజాం పంపిణీ హక్కుల్ని నిర్మాత దిల్ రాజు రికార్డు స్థాయిలో 9 కోట్లకు కొనుగోలు చేయగా, సీడెడ్ పంపిణీ హక్కులను 8 కోట్లకు కోడూరు మధు కొనుగోలు చేశారు.

ఇక గుంటూరు, నెల్లూరు హక్కులను 7 కోట్లకు ప్రసాద్ సొంతం చేసుకోగా, ఈస్ట్ గోదావరి 2.07 కోట్లకు గాయత్రి ఫిలింస్ సంస్థ సొంతం చేసుకుంది. వెస్ట్ గోదావరి 1.90 కోట్లకు అమ్మారట. ఇక ఉత్తరాంధ్ర తామే స్వయంగా విడుదల చేయాలని నిర్మాతల ఆలోచనగా తెలిసింది. లేకపోతే క్రాంతి పిక్చర్స్ ద్వారా విడుదల చేసే అవకాశముంది. మొత్తానికి యన్.టి.ఆర్ "దమ్ము" పవర్ దుమ్ము దులిపేస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.