English | Telugu

రజనీ కాంత్ కోలుకుంటున్నారు

రజనీ కాంత్ కోలుకుంటున్నారు అని ఆయన అన్నయ్య సత్యన్నారాయణ మీడియాకు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ "రాణా" సినిమా ప్రారంభమయిన దగ్గర నుంచీ ఒక నెల లోపలే మూడుసార్లు హాస్పిటల్ పాలవటం ఆయన అభిమానులను కలవరపరుస్తుంది. రజనీ కాంత్ ఆరోగ్యం మీద రక రకాల పుకార్లు కూడా మీడియాలో చోటుచేసుకోవటంతో రజనీ కాంత్ కుటుంబ సభ్యులకు రజనీ కాంత్ ఆరోగ్యం గురించి ప్రతి రోజూ మీడియాలో వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రజనీ కాంత్ ఊపిరితిత్తుల్లో ఉన్న అనవసరమైన నీరు డాక్టర్లు తీసేయటంతో ఆయన త్వరగానే కోలుకుంటున్నారని రజనీ కాంత్ సోదరుడు మీడియాకు తెలియజేశారు. రజనీ కాంత్ కుమార్తె సౌందర్య రజనీ కాంత్ ను పరామర్శించినప్పుడు తీసిన ఫొటోని మా తెలుగు వన్ ప్రేక్షకుల కోసం అందిస్తున్నాం. రజనీ కాంత్ అతి త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి సినిమాల్లో నటించాలని తెలుగువన్ కూడా ఆశిస్తూంది.