English | Telugu

కూలీకి రజనీ ఎంత తీసుకున్నాడు!.. నాగార్జునతో పాటు మిగతా వాళ్ళు ఇంతేనా!

అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకి తెరదించుతు సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth),కింగ్ నాగార్జున(Nagarjuna)ప్రెస్టేజియస్ట్ మూవీ 'కూలీ'(Coolie)ఈ రోజు థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. 'దేవ'గా రజనీ, సైమన్ గా 'నాగ్' తమ అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసారని అభిమానులతో పాటు, ప్రేక్షకులు ముక్త కంఠంతో చెప్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంతో పాటు సన్ పిక్చర్స్ నిర్మాణపు విలువలు ఒక రేంజ్ లో ఉన్నాయనే మాటలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కూలీకి సంబంధించి రజనీకాంత్ తో పాటు ఎవెరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే చర్చ రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. ఈ క్రమంలో ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక 'డెక్కన్ హెరాల్డ్' నివేదిక ప్రకారం కూలీకి రజనీ 200 కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ తీసుకున్నాడని, నాగార్జున 10 కోట్లు, అమీర్ ఖాన్ 20 కోట్లు, శృతి హాసన్ 4 కోట్లు, స్పెషల్ సాంగ్ చేసిన పూజాహెగ్డే 3 కోట్లు, ఉపేంద్ర, సత్యరాజ్ ఐదు కోట్లు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ 50 కోట్లు, మ్యూజిక్ ని అందించిన అనిరుద్ 15 కోట్లు తీసుకుట్టుగా డెక్కన్ హెరాల్డ్'(Deccan herald)నివేదిక ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

'కూలీ'ని భారీ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్(Sun Pictures)పై కళానిధి మారన్(Kalanithi Maran)సుమారు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు. కథకి తగ్గ ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ ని ఎంచుకోవడంతో పాటు, కథకి తగ్గట్టుగా భారీ సన్నివేశాలని చిత్రీకరించడంలోను సన్ పిక్చర్స్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. అందుకే ఖర్చుకి వెనకాడకుండా కూలీలో భారీ కాస్టింగ్ ని ఎంపిక చేసుకుంది. సన్నివేశాలు కూడా ఎంతో రిచ్ గా ఉన్నాయని మూవీ చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు. రజనీ రీసెంట్ హిట్ జైలర్ ని సన్ పిక్చర్స్ నే నిర్మించింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.