English | Telugu

జయసుధ ఓడినా సెటైర్లు వేసింది..!!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో పరాజయం పాలైన జయసుధ సాయంత్రానికి తీరిగ్గా మా ఎన్నికల ఫలితాలపై స్పదించారు. రాజేంద్రప్రసాద్‌ గెలిచినందుకు ఆయనకు అభినందనలు తెలుపుతూనే, ఆయనపై పై సెటైర్లు కూడా వేశారు. గెలిచిన తర్వాత రాజేంద్రప్రసాద్‌, రాజకీయ ప్రసంగాలు చేయడం తనకు నచ్చలేదన్నదన్నారు. నాయకుడిగా ఆయన వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని నీతులు చెప్పారు. కౌంటింగ్‌ తర్వాత రాజేంద్రప్రసాద్‌ కాస్త ఎగ్రెసివ్‌గానే మాట్లాడిన విషయం నిజమే కానీ ఓడిపోయిన జయసుధ ఆయనపై సెటైర్లు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తానికి జయసుధ ఎన్నికల ఫలితాలను ముందే ఊహించారో? ఏమో గానీ కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఫిల్మ్ చాంబర్ వైపు ఆమె కన్నెత్తి కూడా చూడలేదు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.