Read more!

English | Telugu

రాజమౌళికి జాతీయ అవార్డు న‌చ్చ‌లేదా..!

రాక రాక‌... తెలుగు సినిమాకి ఓ జాతీయ అవార్డు వ‌చ్చింది. అర‌వై మూడేళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ర‌వాత తెలుగు సినిమా జాతీయ స్థాయిలో స‌గ‌ర్వంగా త‌లెత్తుకొంది. పైర‌వీలో జ‌రిగాయో, నిజంగానే బాహుబలికి అంత స‌త్తా ఉందో, భ‌జ‌రంగీ భాయ్ జాన్ లాంటి సినిమాల‌న్నీ బాహుబ‌లి ముందు నిజంగానే దిగ‌దుడుపో తెలీదు గానీ... తెలుగు సినిమాకి మాత్రం బాహుబ‌లి చెప్పుకోలేనంత మేలు చేకూర్చి పెట్టింది. అయితే.. బాహుబ‌లికి జాతీయ అవార్డు విష‌యంలో రాజ‌మౌళి హ్యాపీగా లేడ‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. మొత్త‌మ్మీద బాహుబ‌లికి రెండు జాతీయ అవార్డులొచ్చాయి.

క‌నీసం 5 అవార్డులైనా వ‌స్తాయ‌ని జ‌క్క‌న్న ఎక్స్‌పెక్ట్ చేశాడ‌ట‌. కెమెరా, ఎడిటింగ్‌, నేప‌థ్య సంగీతం, ఉత్తమ స‌హాయ న‌టీన‌టుల జాబితాలో అవార్డులు ఖాయం అని లెక్క‌లేసుకొన్నార‌ట‌. అయితే... అవేం జ్యూరీ ప‌రిగ‌ణించ‌లేదు. దాంతో జ‌క్కన్న ఏదో వెలితి ఫీల‌వుతున్నాడ‌ని టాక్‌. జాతీయ అవార్డు రాగానే మీడియా ప్ర‌తినిధులు, కొన్ని ఛాన‌ళ్లు రాజ‌మౌళితో మాట్లాడాల‌ని తెగ తాప‌త్ర‌య‌ప‌డ్డారు. ఇంట‌ర్వ్యూలు తీసుకోవ‌డానికి ప్లాన్ చేశారు. అయితే రాజ‌మౌళి మాత్రం మీడియా ముందుకు రావ‌డానికి తిర‌స్క‌రించాడు. ట్వీటు కూడా ఎప్పుడో పెట్టాడు. దీన్ని బ‌ట్టి చూస్తే...జక్కన్న హర్టయినట్టే కనిపిస్తోంది మరి. అవార్డ్స్ వచ్చినా రాకపోయినా, తెలుగు ఖ్యాతిని బాహుబలి విశ్వవిఖ్యాతం చేసిందన్నది మాత్రం ఎవ్వరూ కాదనలేని వాస్తవం.