Read more!

English | Telugu

బాహుబలి కీర్తికిరీటంలో మరో కలికితురాయి..!

తెలుగువారితో పాటు, భారతీయులందరూ గర్వించదగ్గ సినిమా బాహుబలి. రిలీజై ఏడాది దాటేసినా, ఇంకా బాహుబలి అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతోంది. ఎన్నో మైలురాళ్లు, రికార్డులను సొంతం చేసుకుంటోంది. తాజాగా బాహుబలి ది బిగినింగ్ కు మరో గౌరవం లభించింది. తెలుగు సినిమాలకు ఎక్కువగా ఆస్కారం ఉండని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో, బాహుబలి స్థానం సంపాదించింది. ఈ అరుదైనా గౌరవాన్ని సొంతం చేసుకోవడం పట్ల మూవీ టీం ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఈ నెల 16న కేన్స్ లోకల్ టైమ్ రాత్రి ఎనిమిదిన్నరకు సినిమాను ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శిస్తారు.

ప్రతిష్టాత్మకమైన ఈ సినిమా పండగకు రాజమౌళితో పాటు, నిర్మాత శోభు యార్లగడ్డ, మూవీలోని కీలక బృందం కేన్స్ వెళ్తున్నారు. కేవలం సినిమాను ప్రదర్శించడమే కాక, మూవీ నిర్మించిన విధానంపై చర్చ కూడా జరుగనుంది. మూవీ టీం తో పాటు, రాడాన్ టెక్నాలజీ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజా కోడూరి కూడా ఈ చర్చలో పాల్గొంటారని సమాచారం. బాహుబలి సినిమాకు సంబంధించి వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో రాజమౌళి ఒక డాక్యుమెంటరీని రూపొందిస్తున్నాడు. దానికి సంబంధించిన విశేషాలు కూడా ఈ చర్చలో భాగంగా ఉండబోతున్నాయి. ఈ మొత్తం చర్చను బాహుబలి ఫేస్ బుక్ పేజీలో లైవ్ లో చూసే అవకాశం ఉండటం విశేషం.