Read more!

English | Telugu

హీరో సూర్య ఆ లెటర్ లో ఏం రాశాడో తెలుసా..?

కొత్త రకం సినిమాలతో ప్రయోగాలు చేయాలంటే ముందుండే హీరో సూర్య. లెటెస్ట్ గా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెలుగు తమిళ ప్రేక్షకుల్ని పలకరించిన ఈ హీరో, ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఫుల్ హ్యాపీ అవుతున్నాడు. తన సినిమాపై అభిమానాన్ని చూపిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ ఒక లేఖ రాసి తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

24పై మీరు చూపిస్తున్న ఆదరణ, కురిపిస్తున్న ప్రశంసలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కేవలం రెండే సినిమాలు చేసిన నా సొంత సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇది పెద్ద అడుగు. టైమ్ ట్రావెల్ నేపధ్యంతో సాగే ఈ సినిమా కథను విక్రమ్ కుమార్ చాలా సింపుల్‌గా చెప్పాడు. మూవీ కోసం విక్రమ్ చాలా హోం వర్క్ చేశాడు. నా తోటి నటీనటులు, టెక్నీషియన్లు, ప్రొడక్షన్ టీంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రతి సన్నివేశంలోను అందరి కష్టం ఉంది. నేను పోషించిన పాత్రల్లో ఏ ఒక్క పాత్రకో కాక, అన్ని పాత్రల్నీ మీరు ఆదరించడం నాకు చలా సంతోషంగా ఉంది. నాపై నా సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రేమతో మీ సూర్య.. అంటూ తన ఫ్యాన్స్ కోసం లేఖ రాశాడు సూర్య.

తెలుగు, తమిళ రాష్ట్రాల్లోనే కాక, ఓవర్సీస్ మార్కెట్ లో కూడా 24 సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే మిలియన్ డాలర్లు దాటేసిన ఈ సినిమా, భారీ రికార్డుల దిశగా పరిగెడుతోంది. కాలంలో ప్రయాణించే వాచ్ నేపథ్యంలో సినిమా సాగడం విశేషం.