English | Telugu

రామ్ చరణ్ "రచ్చ" టైటిల్ సాంగ్ లిరిక్స్

రామ్ చరణ్ "రచ్చ" టైటిల్ సాంగ్ లిరిక్స్ రచ్చ రచ్చగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్న హీరోయిన్ గా, "ఏమైందీ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్న మాస్ మసాలా ఎంటర్ టైన్ మెంట్ చిత్రం "రచ్చ". ఈ "రచ్చ" చిత్రం షూటింగ్ శ్రీలంక, చైనా దేశాల్లో పూర్తిచేసుకుని ప్రస్తుతం చెన్నైలో టైటిల్ సాంగ్ షూటింగ్ లో ఉంది.

ఆ టైటిల్ సాంగ్ ఇలా సాగుతుంది. "జీవనం నాన్నిచ్చాడు...జీవితం మీరిచ్చారు...రచ్చ రచ్చ రచ్చ నాకెవరూ పోటీ లేరు... నాకెవరూ సాటి రారు...రచ్చ రచ్చ రచ్చ" ఇలా సాగుతుందండీ రచ్చ టైటిల్ సాంగ్...మెగా ఫ్యాన్స్ కి విందు భోజనంలాంటి ఈ "రచ్చ" చిత్రం ఒక పండగే...!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.