English | Telugu
రభస ట్రెయిలర్ అదుర్స్
Updated : May 20, 2014
రభస ట్రెయిలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే విశేష స్పందన అందుకుంది. రభసలో న్యూలుక్ తో కనిపించిన ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత ఇలాంటి లుక్ తో చూశానంటూ రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆది, సింహాద్రి, రాఖీ, కంత్రి, శక్తి వంటి సినిమాల్లో పవర్ ఫుల్ పర్ ఫార్మన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ రభస ట్రెయిలర్ లో మరోసారి యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్ తో అలరించనున్నాడు.
ట్రెయిలర్ తోనే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంటూ టాక్ మొదలైంది సినీ వర్గాల్లో. పుట్టిన రోజు నాడు ఇంతకన్నా మంచి కానుక ఎన్టీఆర్ కు ఇంకేమి ఉండదు అని అనుకోవచ్చు.