English | Telugu

పాలు పిండిన ప్రియాంక చోప్రా

పాలు పిండిన ప్రియాంక చోప్రా అని ముంబై మీడియా అంటోంది. ఇదేంటి...? ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పాలు పిండటం ఏమిటి...? ఆమెకేం అవసరమొచ్చింది...? ఓహో ఏదైనా సినిమాలో అలా నటించాల్సి వచ్చిందేమో అనుకుంటున్నారా...? అలా అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఇంతకీ విషయమేమిటంటే యన్ డి టి వి వారు నిర్వహిస్తున్న "గ్రీనాధన్" ప్రోగ్రామ్ లో భాగంగా రాజస్థాన్ లోని మన్ వాస్ అనే ఒక మారుమూల కుగ్రామానికి వెళ్ళింది ప్రియాంక చోప్రా.

మన్ వాస్ ఎంత కుగ్రామమంటే ఆ ఊర్లో కరెంటు లేదు. అక్కడ దీపాలు వెలగాలంటే సోలార్ లాంతర్లే గతి. అలాంటి ఊరికి వెళ్ళిన ప్రియాంక చోప్రా అక్కడి గ్రామీణ వాతావరణాన్ని, ఆ గ్రామీణుల జీవన విధానాన్ని దగ్గరగా తెలుసుకోవాలని ప్రయత్నించిన సందర్భంలో పాలుపిండుతున్న ఒక స్త్రీ దగ్గర పాలుపిండటం ఎలాగో నేర్చుకోవటానికి ప్రయత్నించింది. పాలు పిండటం నేర్చుకుంటే రేపు సినిమాల్లో ఫేడవుట్ అయ్యాక పాడి పరిశ్రమ పెట్టుకుని బ్రతికేయవచ్చనేమో ప్రియాంక చోప్రా అభిప్రాయం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.