Read more!

English | Telugu

ప్రియమణి ట్విట్టర్లో కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్...!

నటి ప్రియమణి తన ట్విట్టర్లో కాంట్రవర్సీ ట్వీట్ చేశారు. ఆడవాళ్లకు భారతదేశం సేఫ్ కాదని, స్త్రీలు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ప్రియమణి చేసిన ట్వీట్స్ ఇప్పుడు చాలా మంది విమర్శలకు ఆమెను గురిచేస్తున్నాయి. భారతదేశం గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలంటూ ట్విటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. దేశంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాల గురించి తన ట్విట్టర్లో ప్రియమణి స్పందించారు. " మళ్లీ మరో రేప్ గురించి విని షాకయ్యాను. బెంగుళూరులో అందరూ చూస్తుండగానే అమ్మాయిని కిడ్నాప్ చేశారు. కేరళలో అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. భారతదేశం మహిళలకు సురక్షితం అని నేను భావించడం లేదు. ఈ దేశంలోని ఆడవాళ్లందరూ ఏదైనా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోండి " ఇవీ ప్రియమణి ట్వీట్లు.

దీంతో ఒక సంఘటన జరిగిందని దేశాన్ని వ్యతిరేకించడమేంటంటూ అందరూ ప్రియమణి పై ట్వీట్ల దాడి చేసేసరికి, " నేను దేశాన్ని వ్యతిరేకించలేదు. కేవలం నా భావాన్ని మాత్రమే వ్యక్తీకరించాను. దేశంలో మహిళలకు భద్రత లేదు అని చెబితే దేశ వ్యతిరేకమా " అంటూ ప్రియమణి తిరిగి ట్వీట్ చేశారు. సెలబ్రిటీలు మామూలుగా మాట్లాడినా వివాదాస్పదమవుతుందని తెలియజెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ప్రియమణి మామూలుగా చేసిన ట్వీట్ ఇప్పుడామెకు దేశ వ్యతిరేకవ్యాఖ్యలు చేసిందంటూ విమర్శలు తీసుకురావడం విచిత్రం.