English | Telugu

ప్రిన్స్, చెర్రీ ఫ్యాన్స్ మధ్య బెట్టింగ్

ప్రిన్స్, చెర్రీ ఫ్యాన్స్ మధ్య బెట్టింగ్ జరుగుతుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన "పోకిరి" చిత్రమ 75 యేళ్ళ తెలుగు సినీ పరిశ్రమ బాక్సాఫీస్ రికార్డ్ లను తిరగరాసింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన "మగధీర" సినిమా ఆ రికార్డులన్నీ చెరిపేసి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇటీవల వంద రోజులు పూర్తిచేసుకున్న మహేష్ బాబు సినిమా "దూకుడు" సినిమా "మగధీర" రికార్డులను తిరగరాసిందని స్వయంగా ఆ చిత్ర నిర్మాత అనీల్ సుంకర తెలియజేశాడు. ఆ విషయం ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకూ, రామ్ చరణ్ తేజ అభిమానులకూ మధ్య పెను వివాదాన్ని రేకెత్తించింది.

మాదే అసలు రికార్డంటే మాదే అసలు రికార్డంటూ ఇరు వర్గాలూ మీడియాకెక్కాయి. అయితే ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "బిజినెస్ మ్యాన్" చిత్రం రేపు రానున్న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతూంది. తమ హీరో నటించిన "బిజినెస్ మ్యాన్" అన్ని రికార్డులనూ బ్రేక్ చేస్తుందని ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులంటూంటే, ఆ చిత్రం రికార్డ్ బ్రేక్ చేయదని రామ్ చరణ్ తేజ అభిమానులు బెట్ కడుతున్నారట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.