English | Telugu
త్వరలోనే అన్ని లెక్కలూ తేలుస్తా.. పవన్ కళ్యాణ్‌కి ప్రకాష్‌రాజ్ కౌంటర్!
Updated : Sep 24, 2024
తిరుమల లడ్డు వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖలు దీనిపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ విషయమై కామెంట్లు చేయడం జరిగింది. అందులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కామెంట్ కూడా ఉంది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక ప్రతికా సమావేశంలో ప్రకాష్‌రాజ్‌ని ఉద్దేశించి మాట్లాడారు. దీనిపై ప్రకాష్‌రాజ్ తాజాగా స్పందించారు. షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న ఆయన ఎక్స్ ద్వారా తన సందేశాన్ని పవన్‌కళ్యాణ్‌కు పంపారు.
ఎక్స్ ద్వారా ప్రకాష్‌రాజ్ ఏమన్నారంటే.. ‘శ్రీ పవన్‌కళ్యాణ్‌గారు.. నేనిప్పుడే మీ ప్రెస్‌మీట్ చూశాను. నేను చెప్పిందేంటి?.. దాన్ని మీరు అపార్థం చేసుకొని తిప్పుతున్నదేంటి? నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతీ మాటకి సమాధానం చెబుతాను. ఈలోపు.. వీలైతే నా ట్వీట్‌ని మళ్ళీ చదవండి. అర్థం చేసుకోండి. ప్లీజ్’ అంటూ తన సమాధానాన్ని తెలియజేశారు ప్రకాష్‌రాజ్.