English | Telugu
పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Updated : Sep 20, 2024
తిరుపతి లడ్డు విషయంలో ప్రముఖ అగ్ర హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)చాలా ఘాటుగానే స్పందించాడు.లడ్డు లో జంతువుల నూనె వాడటం చాలా బాధాకరం.ఈ సంఘటనతో భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఆందోళన చెందుతున్నారు. మొత్తం భారత్‌లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ని ఏర్పాటు చేయాల్సిన సమయం కూడా ఆసన్నమైందని ట్విట్టర్ ద్వారా తన ఆవేదనని తెలియచేసాడు. అలాగే దోషులని వదలబోమని పూర్తి ఎంక్వరీ చేసి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు మీద చట్టప్రకారం చర్యలు కూడా తీసుంటామని కూడా చెప్పాడు.ఇక దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా కూడా నిరసన జ్వాలలు చేపడుతున్నారు.ఈ నేపథ్యంలో పవన్ ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్(praksash raj)ఒక ట్వీట్ చేసాడు
పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సిఎం గా ఉన్న రాష్ట్రంలో తిరుపతి లడ్డు కల్తీ సంఘటన జరిగింది.దయచేసి ఈ విషయం మీద విచారణ చేపట్టి దోషులెవరో కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోండి. కానీ మీరు ఆందోళనలను వ్యాపింపజేస్తు సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారు. దేశంలో మనకి ఇప్పటికే మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసాడు. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఇక ప్రకాష్ రాజ్ ట్వీట్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ ట్వీట్ మంచి ఉద్దేశంతోనే చేసుండచ్చు, కానీ ఏడుకొండలవాడికి విశ్వమంతా భక్తులున్నారు. తిరుపతి లడ్డుని ప్రసాదంగా తీసుకోవడాన్ని హిందువులంతా పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటి లడ్డు లో కల్తీ జరిగితే హిందువులంతా ఆందోళన చెయ్యకుండా ఉంటారా! పవన్ చెబితేనో, కేంద్ర పెద్దలు చెబితేనో హిందువులు ఆందోళన చేయటం లేదనే విషయాన్ని ప్రకాష్ రాజ్ గుర్తించాలని కామెంట్స్ చేస్తున్నారు.