English | Telugu

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు హైలెట్స్..బహుశా ఇండియాలోనే మొదటిదేమో    

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు(akkineni nageswara rao)గారి శత జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అక్కినేని  అభిమానులు  చాలా ఘనంగా జరిపారు.ఇక హైదరాబాద్ లో కూడా అక్కినేని కుటుంబ సభ్యులు అక్కినేని జయంతిని ఎంతో వైభవంగా జరపడమే కాకుండా ఫ్యాన్స్ అంటే తమకి ఎంత అభిమానమో మరో సారి చాటి చెప్పారు.మరి శత జయంతి వేడుకలు హైలెట్స్ ఒకసారి చూద్దాం  

1 . అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత  ఫ్యాన్స్ అందరితో కలిసి భోజనాలు చేసి, ఆరు వందల  మంది సీనియర్ అభిమానులకు బట్టలు బహుకరించారు 

2 . దేశవ్యాప్తంగా ANR 100  కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్‌

3. హైదరబాద్ లో 'దేవదాసు' 4K స్క్రీనింగ్ తో ఫెస్టివల్‌ ఘనంగా ప్రారంభం 

4. మూడు రోజుల పాటు 31 సిటీస్ లో ANR గారి 10 ఐకానిక్ మూవీస్ ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శన 

5. అక్కినేని నాగేశ్వరరావు గారి పోస్టల్ స్టాంప్ రిలీజ్ 

6 . మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)గారికి బిగ్ బి అమితాబ్ బచ్చన్(amitabh bachchan)గారి చేతులు మీదగా ANR అవార్డ్ ని  అక్టోబర్ 28న ప్రదానోత్సవం చెయ్యడం. 
 
7. గోవా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ANR గారి శత జయంతిని ఘనంగా సెలబ్రేట్ చేయబోతున్న భారత ప్రభుత్వం