English | Telugu

పవన్ తమ్ముడి సినిమా రిలీజ్ రేపే..!!

పది, పదిహేనేళ్ల క్రితం తెలుగు తెరపై హీరో ఎంట్రీ ఇచ్చి అదృష్టం కలసిరాకపోవడంతో క్యారెక్టర్ రోల్స్ వేస్తున్నాడు శివబాలాజీ. కొత్త వాళ్ల ఎంట్రీతో అవి కూడా దక్కడం కష్టంగా మారింది. అలాంటి బాలాజీ చాలా రోజుల తర్వాత మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. స్వయంగా తానే నిర్మాతగా మారి "స్నేహమేరా జీవితం" అనే సినిమాను నిర్మిస్తున్నాడు. 1982లో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో శివబాలాజీ, రాజీవ్ కనకాల కీలకపాత్రలు పోషించారు. గాడ్ ఫాదర్ అంటూ ఎవ్వరూ లేరు.. అందుకే ఆయన్ను గెలిపించడానికి ఒక హీరో ఫ్యాన్స్ రెడీ అయ్యారు.

బిగ్‌బాస్ షోలో శివబాలాజీ గెలవడానికి కూడా వారే కారణమట.. ఆయనకు అందరికన్నాఎక్కువ వోట్లు వచ్చేలా చేసి విజేతగా నిలబెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వారు ఎవరో కాదు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు. ఎందుకంటే శివబాలాజీ, కళ్యాణ్‌కు బాగా సన్నిహితుడు.. కాటమరాయుడులో పవర్‌స్టార్‌కు తమ్ముడిగానూ నటించారు. అందుకే శివబాలాజీని పవన్ ఫ్యాన్స్ ‌భుజానికెత్తుకున్నారు. బిగ్‌బాస్ సీజన్-1లో విన్నర్‌ని చేసినట్లే.. ఆయన రీసెంట్ మూవీ స్నేహమేరా జీవితాన్ని కూడా హిట్టు మెట్టెక్కించాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటూ కొద్దిరోజుల క్రితం పూజలు కూడా చేశారు. వీళ్ల హంగామా చూస్తుంటే సినిమా హిట్టయ్యే దాకా వదిలేలా కనిపించడం లేదంటూ ఫిల్మ్‌నగర్‌లో జోరుగా చర్చించుకుంటున్నారు.