English | Telugu
పొన్నియిన్ సెల్వన్ - కార్తి చేసిన ప్రామిస్!
Updated : Mar 1, 2023
బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందన్నది అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. లేటెస్ట్ గా పొన్నియిన్ సెల్వన్ సినిమా బిహైండ్ ద సీన్స్ రిలీజ్ చేశారు మేకర్స్. కార్తి, జయం రవి, జయరామ్ ఈ వీడియోలో కనిపిస్తున్నారు. పీయస్1 గురించి, పీయస్2 గురించి మాట్లాడుకుంటున్నట్టు ఉంది వీడియో. ఒక్క నిమిషం మూడు సెకన్ల నిడివి ఉన్న వీడియో అది. పీయస్2, ది చోళాస్ ఆర్ బ్యాక్ అంటూ సాగుతోంది వీడియో. కార్తి, జయం రవి, విక్రమ్ కలిసి ఈ సెకండ్ పార్టులో వ్యూయర్స్ ఏం చూడాలనుకుంటారనే విషయం గురించి మాట్లాడుకుంటున్నట్టు కనిపించింది. మణిరత్నం తెరకెక్కిస్తున్న మ్యాగ్నమ్ ఆపస్ ప్రాజెక్ట్ ఇది.
కార్తి మాట్లాడుతూ ``నేను ఫస్ట్ పార్టులో వల్లవరాయన్ వందియదేవన్‌గా కనిపించాను. సెకండ్ పార్టులోనూ నా కేరక్టర్ ప్రధానంగా సాగుతుంది. మాసివ్ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటిదాకా ఎవ్వరూ చూడనిదాన్ని ఈ సినిమాలో చూస్తారు`` అని అన్నారు. జయం రవి, విక్రమ్ ఇద్దరూ డిస్కస్ చేసిన విషయాలు చాలా బాగా వైరల్ అయ్యాయి. జయం రవి మాట్లాడుతూ ``ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లోనే నా కేరక్టర్ చనిపోయిందని అందరూ అనుకుంటారు. కానీ ఇందులో ట్విస్ట్ ఆకట్టుకుంటుంది`` అని అన్నారు. విక్రమ్ మాట్లాడుతూ ``లవ్‌స్టోరీ విషయంలో కూడా చాలా సస్పెన్స్ ఉంటుంది. ఎవరూ ఊహించని విషయాలు రివీల్ అవుతాయి`` అని చెప్పారు.
పొన్నియిన్ సెల్వన్ పార్ట్ ఒన్ చాలా చోట్ల బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. 500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు. త్రిష, జయరామ్, ఐశ్వర్యలక్ష్మి, శోభిత ధూళిపాళ, ప్రభు, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, ప్రకాష్‌రాజ్, రెహమాన్, పార్తిబన్, లాల్ కీలక పాత్రల్లో నటించారు. కల్కి రాసిన నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా తెరకెక్కుతున్నాయి ఈ రెండు పార్టులు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2ని ఏప్రిల్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చోళులకాలం నాటి కథతో తెరకెక్కుతున్న చిత్రమిది.