English | Telugu

పవన్ చిత్రం టైటిల్ ప్రకటన రేపే

పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో హాస్యనటుడు గణెష్ నిర్మిస్తున్న చిత్రం "లవ్ లీ".హిందీలో "లవ్ ఆజ్ కల్ "చిత్రాన్ని తెలుగులో "లవ్ లీ" పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం గురించి ఏ ఒక్క విషయాన్ని కూడా బయటకు రానీయకుండా జాగ్రత్తపడ్డారు ఈ చిత్రం యూనిట్.

తన సెల్ ఫోన్ లో త్రిష తీసుకున్న ఫొటోలను కనీసం తన ట్విట్టర్ లో పోస్ట్ చేసుకుందామనుకున్నా దర్శకుడు వద్దని వార్నింగిచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందన్న విషయాన్ని,ఆడియో ఎప్పుడు విడుదలవుతుందన్న విషయాన్ని రేపు అనగా ఫిబ్రవరి 4 వ తేదీన మీడియా సమావేశంలో ప్రకటించనున్నారు ఈ చిత్రం యూనిట్.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.