Read more!

English | Telugu

అలిసిపోయి వచ్చిన ఆన్నయ్య సాక్సుల్ని తీసేవాడిని - పవన్

పవన్ కళ్యాణ్ స్పీచ్ ఆయన మాటల్లోనే..

" యాక్టింగ్ అంటే నాకు తెలియదు. నా దృష్టిలో హీరో అంటే చిరంజీవి గారు మాత్రమే. ఒకప్పుడు అమితాబ్ అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ అన్నయ్య హీరో అయిన తర్వాత అన్నయ్య మాత్రమే నాకు హీరో. ఈ రోజు యాక్టర్ అయి మీకు కనబడుతున్నానంటే దానికి అన్నయ్య వదినే కారణం. నాకు అన్నయ్య మీద ఇష్టం అనేది లోపల ఉంటుంది. బహిరంగంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు బయటికి వస్తుంటుంది. నేను ఏ పని చేయకండా ఇంట్లో తింటుంటే, అన్నయ్య రోజనక పగలనక కష్టపడి చిరిగిపోయిన షూస్ తో అలసిపోయి షూటింగ్ నుంచి వచ్చి పడుకునే వారు. ఆయన సాక్సులు నేనే తీసేవాడిని. కానీ ఆయన చెమట నాకు సువాసనగా అనిపించేది. ఒక కష్టం తాలూకు సువాసన అది. ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఒక లక్ష్యాన్ని ఊహించుకుని, ఎలాంటి అండదండల్లేకుండా కష్టపడి పైకొచ్చి, అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అన్నయ్య. ఆయన్ని అన్నయ్యకంటే కూడా చాలామందికి స్ఫూర్తినిచ్చిన మహావ్యక్తిగా చూస్తాన్నేను. ఆయనకు చెడ్డపేరు తీసుకురాకూడదనే బాగా ఎక్కువ కష్టపడుతుంటాను. మా బంధం వేరు. రాజకీయాలు వేరు. అవి రెండు దారులు. ఆయన నా గుండెల్లోనే ఉంటారు. నేను పదే పదే ప్రూవ్ చేసుకోను. అందరికీ చెప్పను. సమయం వచ్చినప్పుడు నిలబడతాను. తల్లిదండ్రుల తర్వాత నాకు తల్లిదండ్రులు మా అన్నయ్య, వదిన ". స్పీచ్ చివర్లో అభిమానుల కోరిక మేరకు ఒక డైలాగ్ చెప్పారు పవన్.