Read more!

English | Telugu

పవన్ ట్రెండ్ ఫాలో అవడు, సెట్ చేస్తాడు - చిరంజీవి

మెగాస్టార్ స్పీచ్ ఆయన మాటల్లో :

" చాలా కాలం తర్వాత తమ్ముడి ఫంక్షన్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా చూసిన సినిమా గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ లో పవన్ విశ్వరూపం చూపించాడు. మాస్ క్యారెక్టర్ చేశాడు. పవన్ ఇలా ఉండాలనే నేను కోరుకున్నాను. ఆ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తూ చూశాను. దబాంగ్ కు కళ్యాణ్ దానికి తనదైన ట్రీట్ మెంట్, ఇంప్రొవైజేషన్, స్టైల్ తో క్లాసిక్ గా మలిచాడు. గబ్బర్ సింగ్ చూస్తే నాకనిపించేది ఒకటే. కళ్యాణ్ బాబు ట్రెండ్ ను పవన్ ఫాలో అవడు. సెట్ చేస్తాడు. అది గబ్బర్ సింగ్ తో ప్రూవ్ అయింది. సెట్స్ కు వెళ్లి చూస్తే, చాలా భిన్నమైన వాతావరణం అనిపించింది. షోలే కోసం రాంపూర్ అనే ఊహా జనితమైన ఊరిని క్రియేట్ చేసి తీశారు. ఇప్పుడు అలాగే రతన్ పూర్ సెట్ వేసి సర్దార్ తీస్తున్నారంటే, ఇది మరో షోలే అవుతుందనిపించింది నాకు. పవన్ లో హ్యూమనిజం, హ్యమరిజం ఉన్నాయి. కళ్యాణ్ గురించి ఒక విషయం చెప్పాలి. అప్పటికింకా ఫ్యూచర్ డిసైడ్ చేసుకోని టైం లో నాదగ్గరికి వచ్చి, ఏం చేయాలి, నాకు ఒక గైడెన్స్ ఇవ్వండి అన్నాడు. డైరెక్షన్ తర్వాత ఎప్పుడైనా చేయచ్చు. కానీ నీలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడు. యాక్టర్ గా నిన్ను నువ్వు తయారుచేసుకో అని నేను చెప్తే తర్వాత తర్ఫీదు పొంది మనసా వాచా కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడు. తను ఎదిగే ప్రతీ అడుగులోనే నేను, మా తల్లిదండ్రులు గర్విస్తాం. "