English | Telugu

పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నాడు! తెలంగాణ ఫ్యాన్స్ ఏమంటున్నారు

-ఫ్యాన్స్ ఏమంటున్నారు!
-పవన్ ఏం చెప్పబోతున్నాడు!
-అధికార పార్టీ ఏమంటుంది!

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ఇటీవల ఆంధ్రప్రదేశ్(Andrapradesh)డిప్యూటీ సిఎం హోదాలో బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లిలో మాట్లాడుతు తెలంగాణ(Telangana)నేతలు గోదావరి జిల్లాల్లోపచ్చదనం బాగుంటుందని అనేవారని ఇప్పుడు కోనసీమలోకి కొబ్బరి చెట్లకి వాళ్ళ దిష్టితగిలినట్లు ఉందని మాట్లాడారు. దీంతో తెలంగాణాకి చెందిన పలువురు నేతలు పవన్ వ్యాఖ్యలపై మండి పడుతున్నారు.

అధికార కాంగ్రెస్ నాయకులైతే తెలంగాణ ప్రజలకి పవన్ క్షమాపణ చెప్పాలని లేదంటే పవన్ సినిమాలని తెలంగాణాలో ఆడనివ్వమని ఖరాకండిగా చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తన మాటలపై పూర్తి వివరణ ఇవ్వలేదు.ఒక వేళ మాట్లాడితే తెలంగాణ బావ జాలం తన ఎదుగుదలకి ఉపయోగపడిందని చెప్పే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడనే ఆసక్తి అందరిలో ఉంది.

also Read: తెలంగాణాలో అఖండ 2 టికెట్ రేట్స్ ఇవేనా!

జనసేన పార్టీ నుంచి మాత్రం పవన్ వ్యాఖ్యలని వక్రీకరిస్తున్నారని అధికారకంగా ఒక లెటర్ విడుదలైంది. తెలంగాణకి చెందిన జనసేన నాయకులతో పాటు పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు పవన్ మాటలని కావాలని కొంతమంది వక్రీకరిస్తున్నారు. తెలంగాణ ప్రాంతాన్ని,ప్రజలని పవన్ అవమానించలేదు. కొంత మంది నాయకులు తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడానికి ఈ విషయాన్నీ రాద్ధాంతం చేస్తున్నారని మాట్లాడుతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.