English | Telugu

ప్రకాష్ రాజ్ విషయంలో మొదలైన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్రీట్ మెంట్ 

పవన్ కళ్యాణ్(pawan kalyan)ప్రకాష్ రాజ్(prakash raj)మధ్య తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి దివ్య ప్రసాదమైన లడ్డు విషయంలో చిన్నపాటి ఇష్యూ లాంటిది జరుగుతున్న విషయం అందరి తెలిసిందే. ప్రకాష్ రాజ్ అయితే ఆ విషయం మీద రకరకాల ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు.వాటిల్లో పవన్ పేరు ప్రస్తావించకపోయినా కూడా అవి  పవన్ ని ఉద్దేశించి చేస్తున్నావనే  విషయం అర్థమవుతూనే ఉంది.

ఆ ట్వీట్ ల పైన పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడి చేసిన అభిప్రాయాలని నేను తప్పుగా అర్ధం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు సరిగానే అర్ధమయింది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.దోషులకి శిక్ష పడాలని నేను స్పందిస్తే ఢిల్లీ లో మీ స్నేహితులు అంటూ కామెంట్ చెయ్యాల్సిన అవసరం ప్రకాష్ రాజ్ కి  లేదు. నిజానికి ప్రకాష్ రాజ్ నాకు చాలా మంచి మిత్రుడు. రాజకీయంగా మా ఇద్దరి దారులు వేరైనా మా మధ్యన ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. ఆయనతో కలిసి వర్క్ చెయ్యడం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు.

ఇప్పడు ఈ మాటలు వైరల్ అవ్వడంతో పవన్, ప్రకాష్ ల మధ్య గొడవ ఎంత వరకు వెళ్తుందో అని ఇరువురి అభిమానులు అనుకున్నారు. కానీ పవన్ మాటలతో ఇక గొడవ సద్దుమణిగినట్టే అని భావిస్తుండంతో పాటు పవర్ స్టార్ ట్రీట్ మెంట్ ప్రేమతోనే ముడిపడి ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక సినిమాల పరంగా ఆ ఇద్దరి కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చిన విషయం తెలిసిందే.