English | Telugu
రేపటి నుండి రామ్ "ఒంగోలు గిత్త"
Updated : May 26, 2012
రేపటి నుండి రామ్ "ఒంగోలు గిత్త" షూటింగ్ గుంటూరులో ప్రారంభం కానుంది. వివరాల్లోకి వెళితే చురుకైన యువ హీరో రామ్ హీరోగా, ఒక కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న నూతన చిత్రం "ఒంగోలు గిత్త". ఈ రామ్ "ఒంగోలు గిత్త" చిత్రం మొన్న మార్చ్ 9 వ తేదీన హైదరాబాద్ లోని నిర్మాత కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది.
రెగ్యులర్ షూటింగ్ మాత్రం రేపటి నుండి అంటే మే 27 వ తేదీ నుండి గుంటూరులో ప్రారంభం కానుంది. ఈ కథ రామ్ ఇమేజ్ కి సరిగ్గా సరిపోయేలా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించాడని సమాచారం. రామ్ "ఒంగోలు గిత్త" చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతాన్నందిస్తున్నారు. రామ్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా, కరుణాకరున్ దర్శకత్వంలో, స్రవంతి రవికిశోర్ నిర్మించిన "ఎందుకంటే ప్రేమంట" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.