English | Telugu

'ఒక లైలా కోసం' ఫస్ట్ వీక్ కలెక్షన్

నాగచైతన్య తాజా చిత్రం 'ఒక లైలా కోసం' ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. డైరెక్టర్ విజయ్ ఫస్ట్ ఫిల్మ్ 'గుండెజారి గల్లంతయ్యిందే'తో పోలిస్తే లైలా నిరాశపరిచిన కానీ వీకెండ్ తరువాత దీపావళి, ప్రమోషన్స్ బాగానే కలిసొచ్చిందని సమాచారం. హుదుద్ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఉత్తరాంధ్ర కొన్ని సెంటర్స్‌లో 'లైలా'కు ఇబ్బందులు ఎదురైన, ఓవరాల్ గా మొదటివారం కలెక్షన్స్‌ బాగా రాబట్టిందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే నాగచైతన్య హిట్ లిస్ట్ లో లైలా కూడా చేరిపోయింది..!!

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.