Read more!

English | Telugu

టాక్ ఫుల్.. కలెక్షన్స్ నిల్.! ఓం బీమ్ బుష్

సినిమాని నిర్మించడమే కాదు..ఏ టైం కి రిలీజ్ చెయ్యాలో కూడా తెలియాలి. అప్పుడే ఆ సినిమా మంచి కలెక్షన్స్ ని సాధిస్తుంది.కానీ తాజాగా విడుదలైన ఒక మూవీ మొదటి షో కే పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. రిలీజ్ టైం రాంగ్ అవడంతో కలెక్షన్స్ డల్ గా ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియా లో వినిపిస్తున్నాయి.ఇంతకీ ఆ సినిమా ఏంటో చూద్దాం!

ఓం భీమ్ బుష్ (Ohm beam bush)శ్రీ విష్ణు, ప్రియ దర్శిని, రాహుల్ రామకృష్ణ లు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మొన్ననే  థియేటర్స్ లో అడుగుపెట్టింది. రిలీజైన అన్నిచోట్ల కూడా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. దీంతో కలెక్షన్స్ భారీగా వస్తాయని మేకర్స్ భావించారు. కానీ  వాళ్ళు అనుకున్నది రివర్స్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్టాల్లో ఐపిఎల్(ipl) హంగామా ప్రారంభం అయ్యింది. ఈ ఎఫెక్ట్  ఓం భీమ్ బుష్ మీద ఖచ్చితంగా పడుతుందని చెప్పవచ్చు.చాలా మంది యువత ఐపి ఎల్ వస్తే చాలు టీవిలకి అతుక్కుపోతుంది.పైగా ధోని (dhoni)కి ఆఖరి సీజన్ అనే ప్రచారం కూడా ఉండటంతో అందరు కూడా ఐ పిఎల్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలాగే చాలా మందికి  అభిమాన క్రికెట్ ప్లేయర్స్  ఉన్నారు.

 తాజాగా జరిగిన  చెన్నై, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా మూవీ కి భారీ స్థాయిలో కలెక్షన్స్ తగ్గాయనే ప్రచారం ఉంది. ఏ సినిమాకైనా వీకెండ్ లోనే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. మరీ ముందుముందు ఓం భీమ్ బుష్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.పైగా ఎలక్షన్స్ ఫీవర్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ అయ్యింది. హర్ష కొనుగంటి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని జగదీష్ తలశిల, సునీల్ బలుసు లు నిర్మించారు. యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేసింది.