English | Telugu

కత్తులతో పవన్ ఫ్యాన్స్ వీరంగం.. చినిగిపోయిన తెర 

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ప్రస్తుతం 'ఓజి'(Og)తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై పూర్తి స్థాయిలో పవన్ తన మానియాని ప్రదర్శించాడనే టాక్ అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి వినపడుతుంది. అసలు మొదట నుంచి 'ఓజి' సూపర్ హిట్ అవుతుందని అభిమానులు నమ్ముతు వస్తున్నారు. పైగా పవన్ ని పేరు పెట్టి పిలవడం బదులు ఓజి అని పిలుచుకుంటు వస్తున్నారు. దీన్ని బట్టి అభిమానుల్లో 'ఓజి' ఎంత బలంగా నాటుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

దీంతో నిన్న రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్స్ కి అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కోవలోనే బెంగుళూరు నగరంలోని' KRపురం' థియేటర్లో జరిగిన ప్రీమియర్ షోకి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. వారిలో కొంత మంది 'ఓజి' లో పవన్ కత్తి పట్టుకొని ఉన్న గెటప్ తో వచ్చారు. పెద్ద పెద్దగా అరుస్తు స్క్రీన్ ముందుకు గంతులేస్తున్నారు.ఒక అభిమాని కత్తితో స్క్రీన్‌ని చింపేయడంతో థియేటర్ లో ఉన్న వారంతా షాక్ కి గురయ్యారు. థియేటర్ యాజమాన్యం కూడా షో ని నిలిపివేసి, భద్రతా సిబ్బంది అభిమానుల్ని థియేటర్ బయటకి పంపించారు. ఆ తర్వాత యధావిధిగా షో ని ప్రారంభించారు.

ఇప్పుడు ఈ ఘటనకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు తమ అభిమానాన్ని వేరే మార్గాల ద్వారా చూపించుకోవాలి కానీ, ఇతరులకి ఇబ్బంది కలిగేలా ఉండకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.