English | Telugu

ఓజి ఖాతాలో అరుదైన రికార్డు 

మేకర్స్ 'ఓజి'(OG)ని ఏ ముహూర్తాన స్టార్ట్ చేసారో కానీ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా 'ఓజి' ఫీవర్ పట్టుకుంది. ఓజి కి పని చేసిన 24 క్రాఫ్ట్స్ పలు రకాల ఇంటర్వూలలో 'ఓజి' గురించి చెప్తున్న మాటలు వింటుంటే గూస్ బంప్స్ కూడా వస్తున్నాయి. పైగా మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ ప్రదర్శిస్తుండటంతో, పవన్ కళ్యాణ్(Pawan Kalyan)సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేసాడనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉంది. అందుకు తగ్గట్టే ప్రీమియర్స్ కి సంబంధించిన టికెట్స్ భారీ స్థాయిలో బుక్ అయ్యాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ(Vijayawada)నగరంలో 8 సింగిల్ స్క్రీన్ లలో 'ఓజి' ని ప్రదర్శిస్తున్నారు. ఆన్ లైన్ లో బుకింగ్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే 4286 టికెట్లు పూర్తిగా అమ్ముడై, 42.64 లక్షల వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్ షోస్ వసూలు విషయంలో విజయవాడ హిస్టరీలోనే ఆల్ టైమ్ రికార్డ్ అనే మాట ఫ్యాన్స్ నుంచి వినపడుతుంది. ఇక విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలతో కలిపి మొత్తం 64 ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తుండగా,1.60 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చే అవకాశం ఉందనే అంచనాలు కూడా ట్రేడ్ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది.

ఓజి కిసెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీచేసింది. పంజా తర్వాత పవన్ కెరీర్ లో Aసర్టిఫికెట్ అందుకున్న మూవీ 'ఓజి' నే. ఇక ప్రీమియర్ షో టిక్కెట్లు ఏపీలో 1000, తెలంగాణలో 800 గా ఉండగా, రీసెంట్ గా తెలంగాణా హైకోర్టు టికెట్ రేట్స్ పెంపుని రద్దు చేస్తు ప్రత్యేక జీవో చేసింది.



అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.