English | Telugu
ఎన్టీఆర్ కొరటాల అసలు కథ ఇదేనా?
Updated : Aug 19, 2015
శ్రీమంతుడు తరవాత కొరటాల శివ సినిమా ఎన్టీఆర్‌తోనే అనుకొన్నారంతా. కానీ సడన్‌గా బన్నీ అల్లుఅర్జున్ అడ్డుపడ్డాడు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా దాదాపుగా ఖాయమైపోయింది. ఎన్టీఆర్ ఈ సినిమా నుంచి ఎందుకు డ్రాప్ అయ్యాడు? కారణం ఏమిటి? అనే ఆసక్తి చిత్రసీమలో నెలకొంది. హిట్ డైరెక్టర్‌ని తారక్ ఎందుకు వదులుకొన్నాడబ్బా??? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే కొరటాల ఇప్పటి వరకూ లైన్ మాత్రమే చెప్పాడట. పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేయడానికి కాస్త సమయం కావాలన్నాడట. అందుకే ఈ ప్రాజెక్ట్ డిలే అవ్వనుందని టాక్. బన్నీకైతే కథ రెడీగా ఉందని, అందుకే బన్నీతో ప్రొసీడ్ అవ్వడానికి కొరటాల సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఇది ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ డ్రాప్ అవ్వడానికి కారణం.