Read more!

English | Telugu

జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ ఫస్ట్ లుక్

శ్రీమంతుడు లాంటి హిట్ తర్వాత మైత్రి మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రెండో సినిమా జనతా గ్యారేజ్. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో ఊపు మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివతో చేస్తున్న సినిమా కావడంతో, జనతా గ్యారేజ్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, చాలా సాదా సీదాగా, గళ్ల చొక్కాతో కనిపిస్తున్న మోహన్ లాల్ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఫ్లాష్ బ్యాక్ లో ఎపిసోడ్లలో మోహన్ లాల్ పాత్ర ఉండబోతోందని సమాచారం. మోహన్ లాల్ కు జోడీగా, దేవయాని కనిపించబోతోంది. జనతా గ్యారేజ్ కోసం సారధి స్టూడియోస్ లో 3 కోట్ల రూపాయల సెట్ వేయడం విశేషం.