Read more!

English | Telugu

జాకీ చాన్ తో ఛాన్స్ కొట్టేసిన లోఫర్ భామ

వరుణ్ లోఫర్ సినిమాలో, పారిజాతంగా అలరించిన దిశా పటానీ గుర్తుందా. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో, ఈ అమ్మడికి కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత టాలీవుడ్ ప్రాజెక్ట్ లు కూడా ఈ పాపకు పడలేదు. కానీ డైరెక్ట్ జాకీచాన్ తో సినిమా చేసే ఛాన్స్ మాత్రం కొట్టేసింది. ఇండో చైనీస్ ఫిల్మ్ గా రూపొందుతున్న ' కుంగ్ పూ యోగా ' అనే ఈ సినిమాలో, దిశ ఆర్కియాలజీ ప్రొఫెసర్ గా కనిపించబోతోంది. సినిమాలో ఆమె పాత్ర యోగా, మార్షల్ ఆర్ట్స్ చేస్తుంది. అవి రెండూ దిశా కు తెలియడంతో ఆమెను తీసుకున్నారు. మగథ సామ్రాజ్యం దాచిపెట్టిన ఒక నిథి కోసం అన్వేషణ చేసే పాత్రలో జాకీచాన్ కనిపించబోతున్నాడు.