English | Telugu
మారుతి పై నితిన్ సంచలన మాటలు
Updated : Feb 20, 2014
యువతను ఆకట్టుకునే బూతు చిత్రాలను తీయడంలో దర్శకుడు మారుతి దిట్ట అని టాలీవుడ్ మొత్తానికి తెలిసిందే. ఈయన తీసే అన్ని సినిమాలు కూడా అదే విధంగా ఉంటాయనేది అందరి అభిప్రాయం. అయితే హీరో నితిన్ కూడా మారుతి గురించి తన అభిప్రాయాన్ని మీడియా ముందు చెప్పేసాడు. మారుతి బ్యానర్లో తెరకెక్కుతున్న "లవర్స్" చిత్రం ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి నితిన్ అతిధిగా విచ్చేసాడు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ..."మారుతి ఇంతకుముందు బూతు సినిమాలు తీశాడు కానీ... ఇపుడు మారిపోయాడు అనే అనుకుంటున్నాను. ఈ "లవర్స్" చిత్రం అలాగే "కొత్త జంట" చిత్రం కూడా నీట్ గా తీశాడనే అనుకుంటున్నాను" అని అన్నాడు. ఈ మాటకు ఖంగుతిన్న మారుతి.. ఏం చెయ్యాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయాడు.