English | Telugu

నితిన్, వి.ఐ.ఆనంద్ కాంబినేష‌న్‌లో యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌!


వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్ త‌న 36 సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్‌ శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ర‌థ స‌ప్త‌మి సంద‌ర్భంగా సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు .

విభిన్న‌మైన క‌థ‌లు, క‌థ‌నాల‌తో సినిమాల‌ను రూపొందించే ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ మ‌రోసారి ఈ భారీ ప్రాజెక్ట్‌తో క్రియేటివ్ బౌండ‌రీస్ రేంజ్‌ను మ‌రింత పెంచ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. సినీ ప్రేక్ష‌కుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా ఈ క్రేజీ సినిమా రూపొంద‌నుంది. ఊరు పేరు భైర‌వ‌కోన చిత్రం త‌ర్వాత ఈ విజ‌న‌రీ డైరెక్ట‌ర్ హై కాన్సెప్ట్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నారు.

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్ హీరోగా న‌టిస్తుండ‌టంతో ఈ మూవీపై ఎగ్జ‌యిట్‌మెంట్ మ‌రింత‌గా పెరిగింది. వెర్స‌టైల్‌, ప‌వ‌ర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునే నితిన్ వంటి క‌థానాయ‌కుడితో.. క్వాలిటీ సినిమాల‌ను గ్రాండ్ స్కేల్‌లో సినిమాను రూపొందించే శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ సంస్థ‌ చేతులు క‌ల‌ప‌టం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఆస‌క్తిని పెంచుతోంది.

ఈ ప్రెస్టీజియ‌స్ కాంబోను చూస్తుంటే సినిమాపై నిర్మాత శ్రీనివాస చిట్టూరికి ఉన్న ప్యాష‌న్ క‌నిపిస్తోంది. ఆదివారం (జ‌న‌వ‌రి 25) ర‌థ స‌ప్త‌మి సంద‌ర్భంగా ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. త్వ‌ర‌లోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. టాలెంటెడ్ హీరో, వైవిధ్యంగా సినిమాను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు, గ్రాండ్‌గా సినిమాను నిర్మించే సంస్థ క‌ల‌యిక‌లో రూపొంద‌బోయే ఈ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్ నితిన్ కెరీర్‌లో అత్యంత ఆస‌క్తిక‌ర‌మై ప్రాజెక్ట్స్‌లో ఒక‌టిగా మార‌నుంది. నితిన్ 36వ సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌నున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం