English | Telugu

ప‌డి లేచిన కెర‌టం.. నితిన్‌

జ‌యం, దిల్‌, సై... కెరీర్ ప్రారంభంలోనే సూప‌ర్ డూప‌ర్ హిట్లిచ్చి - యంగ్ హీరోల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించిన హీరో నితిన్‌. ప‌క్కింటి అబ్బాయిలా, చాక్లెట్ బోయ్‌లా అప్పుడ‌ప్పుడూ మాస్ కుర్రాడిలా అల‌రించి - అద‌ర‌గొట్టేశాడు. మూడు హిట్ల‌తో తారాప‌థంలోకి చేరి.. ఆ త‌ర‌వాత 12 వ‌రుస ఫ్లాపుల‌తో కొంచెం కొంచెం.. అలా.. అలా.. పాతాళానికి ప‌డిపోయాడు. నితిన్ విజ‌యాలు మూణ్నాళ్ల ముచ్చటే, ఇక నితిన్ కోలుకోడు, నితిన్‌ని మర్చిపోవ‌చ్చు అనుకొంటున్న ద‌శ‌లో మ‌ళ్లీ విజృంభించ‌డం మొద‌లెట్టాడు. ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాల‌తో త‌న స్టామినా చూపించాడు. నితిన్ మ‌ళ్లీ హిట్ హీరో అయిపోయాడు. నితిన్ సినిమా అంటే జ‌నాల్లో న‌మ్మ‌కాలు పెర‌గ‌డం మొద‌ల‌య్యాయి. నిర్మాతలు మ‌ళ్లీ నితిన్ ఇంటి ముందు క్యూ క‌ట్ట‌డం మొద‌లెట్టారు. అంతే.. హిట్‌కీ ఫ్లాప్‌కీ మ‌ధ్య ఉన్న తేడా. ఇప్పుడు నితిన్ మ‌రోసారి పూరి జ‌గ‌న్నాథ్‌తో క‌ల‌సి ఓ సినిమా చేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. అటు నిర్మాత‌గానూ.. నితిన్ త‌న అభిరుచి చాటుకొంటున్నాడు. ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాలు త‌న బ్యాన‌ర్‌లోనే తెర‌కెక్కించాడు. ఇప్పుడు పూరి సినిమా కూడా త‌నే నిర్మిస్తున్నాడు. అంతే కాదు.. టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖిల్ సినిమాకీ నిర్మాత నితినే. రెండు కొత్త సినిమాల‌కు సైన్లు చేసిన నితిన్‌.. త్వ‌ర‌లోనే కొరియ‌ర్ బోయ్ క‌ల్యాణ్ గాప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. యంగ్ హీరోల‌లో త‌న ప్ర‌త్యేక‌త చూపిస్తూ, త‌న‌కంటూ ఓ ఇమేజ్ సృష్టించుకొని, వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నితిన్‌కి ఆల్ దిబెస్ట్ తో పాటు.. పుట్టిన రోజు శుభాకాంక్ష‌లూ తెల‌పండి. ఎందుకంటే ఈరోజు నితిన్ బ‌ర్త్ డే.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.