English | Telugu

వీరమల్లు లవ్ స్టోరీని బయటపెట్టిన పంచమి

2018లో అక్కినేని అఖిల్(akhil)హీరోగా వచ్చిన 'మిస్టర్ మజ్ను' చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన భామ నిధిఅగర్వాల్(nidhhi agerwal)ఆ తర్వాత 'ఇస్మార్ శంకర్' 'హీరో' వంటి సినిమాల్లో నటించి తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan)ప్రభాస్(prabhas)లాంటి స్టార్ హీరోల సరసన 'హరిహర వీరమల్లు'(hari hara veeramallu)'ది రాజాసాబ్'(the raja saab)లాంటి భారీ ప్రాజక్ట్స్ లో చేస్తుంది.

నిధి లేటెస్ట్ గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడుతూ హరిహరవీరమల్లు లో పంచమి అనే క్యారక్టర్ ని చేస్తున్నాను.నటిగా నాలోని పలు కోణాల్ని ఆవిష్కరిస్తుంది.వీర,పంచమి లప్రేమకథ చాలా బాగుంటుంది.హరిహరవీరమల్లు 2 అందరు అనుకున్న దాని కన్నా ముందే వస్తుందని చెప్పింది.ఇప్పుడు ఈ మాటలు పవన్ ఫ్యాన్స్ లో జోష్ ని నింపుతున్నాయి

ఇక  రాజాసాబ్ గురించి మాట్లాడుతు రాజాసాబ్ ఒక అదంటిక్ రొమాంటిక్ కామెడీ చిత్రం.కానీ అన్ని రకాల వాణిజ్య అంశాలు అందులో ఉంటాయి.పైగా ఈ సినిమా ద్వారా ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు అంటారో కూడా తెలిసొచ్చింది.త్వరలోనే నా నుంచి మరో క్రేజీ ప్రాజక్ట్ రానుందని కూడా చెప్పుకొచ్చింది.