English | Telugu

పుష్ప2 రిలీజ్ సందర్భంగా టిడిపీ కార్యకర్తలపై వేడినీళ్లతో వైసిపీ దాడి

అల్లు అర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)ఈ రోజు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2021 లో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 కాంబో తిరిగి రిపీట్ అవ్వడంతో సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. నిన్న మిడ్ నైట్ నుంచే ప్రీమియర్స్ ని కూడా జరుపుకున్న ఈ మూవీ ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.

ఇక పుష్ప 2(pushpa 2)ప్రదర్శిస్తున్న తిరుపతి(tirupati)దగ్గరలోని పాకాల శ్రీ రామకృష్ణ థియేటర్ దగ్గరలో వైసీపీ కి చెందిన కొంతమంది కార్యకర్తలు మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి, చంద్రగిరి మాజీ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలని ఏర్పాటు చేసి మంచి చేసి మోసపోయిన సిఎం, ఎంఎల్ఏ తాలూకా, 2029 కి సిద్ధం తగ్గేదేలే అంటూ ఫ్లెక్సి లని ఏర్పాటు చెయ్యడం జరిగింది.దీంతో ఈ వ్యాఖ్యలపై తెలుగు దేశం శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీసివేయాలని కోరగా వైసిపీ నేతలు అంగీకరించలేదు.

ఆ తర్వాత టిడీపీ(tdp)నేతలు ఫ్లెక్సీలని తీసి వేయడం జరిగింది.దీంతో ముందుగానే ప్లాన్ చేసుకున్న వైసిపీ కార్యకర్తలు కర్రలు,సీసాలు,వేడి నీళ్లతో టిడిపీ కార్యకర్తలపై దాడి చెయ్యగా టిడీపీ కార్యకర్తలు కూడా అందుకు తగట్టుగాప్రతిఘటించడంతో థియేటర్ పరిసరాల్లో ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది.దీంతో అక్కడకి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలని చెదర గొట్టడంతో పాటుగా  వాళ్లపై కేసులు కూడా నమోదు చేసారు.  దీంతో పాకాల వెళ్లే దారిలో ట్రాఫిక్ పూర్తిగా సంభవించింది.