English | Telugu

"సాయిబాబా పాత్ర నాకో ఛాలెంజ్" - నాగ్

"సాయిబాబా పాత్ర నాకో ఛాలెంజ్" అని కింగ్ అక్కినేని నాగార్జున అన్నారు. వివరాల్లోకి వెళితే "రాజన్న" చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో నాగార్జున మాట్లాడారు. ఆ సందర్భంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున షిర్డీ సాయిబాబాగా నటించే చిత్రం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆ చిత్రం గురించీ, సాయిబాబా పాత్ర గురించీ తన మనసులో భావాలను హీరో నాగార్జున ఇలా అన్నారు.

"నేనింతవరకూ అన్నమయ్య, రామదాసు వంటి భక్తుల పాత్రల్లోనే నటించాను. కానీ షిర్డీ సాయిబాబా భక్తుడు కాదు. ప్రపంచంలో ఆయన్ని భగవంతుడిగా కోట్లాదిమంది నమ్ముతారు. అలాంటి పవిత్ర మైనటువంటి భగవంతుడి పాత్రలో నటించటం నాకు ఒక నటుడిగా పెద్ద ఛాలెంజ్" అని అన్నారు. ఈ మాటలను బట్టి చూస్తే సాయిబాబా పాత్ర గురించి హీరో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మనకు అర్థమవుతుంది కదూ...!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.