English | Telugu
నాగార్జున కోసమే హైడ్రా వచ్చిందా!
Updated : Sep 10, 2024
కొన్నిరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో యువసామ్రాట్ నాగార్జున(nagarjuna)కి చెందిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేసిన విషయం తెలిసిందే. నాగ్ హైకోర్టు కి వెళ్లి స్టే తెచ్చుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు ప్రారంభించారు.ఇక ఈ విషయంలో నాగ్ సంస్థల యొక్క వాదనలు ఒకలా ఉన్నా, చెరువుని కొంత మేర ఆక్రమించి కట్టారని ప్రభుత్వ వాదన. మరి ఇది నిజమైతే మిగతా వాళ్ల విషయంలో ఎందుకు ఉదాసీనత చుపిస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే విధంగా నాగ్ కోసమే హైడ్రా ని తీసుకొచ్చారా అనే అనుమానాన్ని కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు హర్షించారు. ఫ్యూచర్ లో హైదరాబాద్ ని కాపాడుకోవడానికి అని.కానీ సోషల్ మీడియా లో ఒక టాపిక్ వస్తుంది
ఫ్యూచర్ లో హైదరాబాద్ ని వరదల నుంచి కాపాడుకోవడానికే చెరువు మీద కట్టిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకే హైడ్రా పేరుతో ఇలాంటి కట్టడాలు మొత్తాన్ని ధ్వంసం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రజలందరు ఎంతగానో హర్షించారు. కానీ ఇప్పుడు వాళ్లంతా హైడ్రా దారి మళ్లిందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రముఖ ఎంపి కి చెందిన కాలేజీ, అలాగే ప్రభుత్వ ప్రతినిధి సోదరుడి ఇల్లు అక్రమ కట్టడం అని రుజువయ్యినా కూడా హైడ్రా వాటి మీద చర్యలు తీసుకోవడం లేదు. అందుకు గవర్నమెంట్ రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటుంది. ఇదే విధంగా మరికొన్ని కూడా ఉన్నాయి. దీంతో హైడ్రా దారిమళ్లిందనే కామెంట్స్ సోషల్ మీడియా లో వస్తున్నాయి. కొన్ని రోజులు ఆగితే అసలు హైడ్రా అనేదే ఉండదని కూడా అంటున్నారు. ఇక నాగ్ అభిమానులు అయితే మా హీరో కోసమే హైడ్రా ని తీసుకొచ్చారా అంటు కామెంట్స్ చేస్తున్నారు.నాగ్ ఇటీవల వరదల వల్ల నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాల కోసం కోటి రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే.