English | Telugu
The Magic of Shiri web series review: ది మేజిక్ ఆఫ్ శిరి వెబ్ సిరీస్ రివ్యూ
Updated : Dec 6, 2024
వెబ్ సిరీస్ : ది మేజిక్ ఆఫ్ శిరి
నటీనటులు : దివ్యాంక త్రిపాఠి, నమిత్ దాస్, దర్శన్ జరీవాలా, జావెద్ జాఫెరీ, నిశాంక్ వర్మ తదితరులు
ఎడిటింగ్: భోధాదిత్య
సినిమాటోగ్రఫీ: శుభంకర్
మ్యూజిక్: దిప్తార్క్ బోస్
నిర్మాతలు: జ్యోతి దేశ్ పాండే, తన్ వీర్ బుక్ వాలా
దర్శకత్వం: బిర్సా దాస్ గుప్తా
ఓటీటీ: జియో సినిమా
హిందీలో ' ది మేజిక్ ఆఫ్ శిరి' పేరుతో ప్రముఖ ఓటీటీ వేదిక 'జియో సినిమా' లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులోను అందుబాటులో ఉంది. దివ్యాంక త్రిపాఠి, నమిత్ దాస్, దర్శన్ జరీవాలా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ:
శిరి (దివ్యాంక త్రిపాఠి), నవీన్(నమిత్ దాస్) భార్యాభర్తలు. పిల్లలు సోనూ - మిన్నూతో కలసి ఢిల్లీలో ఉంటారు. శిరి - నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. నవీన్ తండ్రి (దర్శన్ జరీవాలా) ఓ ప్రభుత్వ బ్యాంకులో పనిచేస్తుంటాడు. తన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం పట్ల ఆసక్తి చూపకపోవడం .. ఒక పంజాబీ యువతిని పెళ్లాడటం ఆయనకి నచ్చదు. అందువలన ఆ ఫ్యామిలీతో వీరికి మాటలు ఉండవు. నవీన్ ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతుంటాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇల్లొదిలి వెళ్లిపోతాడు. నవీన్ ఇల్లొదిలి వెళ్లిపోవడంతో పిల్లలిద్దరిని తీసుకుని తమ ఇంటికి వచ్చేయమని శిరి అత్తామామలు ఒత్తిడి చేస్తారు. అయిన తన పిల్లలను తనే పోషించాలని శిరి భావిస్తుంది. తండ్రి ఊరెళ్లాడని పిల్లలకు అబద్ధం చెప్తూ రోజులు నెట్టుకొస్తూ ఉంటుంది. ఈ సమయంలోనే ఇంద్రజాల విద్యలో ఆరితేరిన సలీమ్ ( జావేద్ జాఫెరీ) .. బిజినెస్ మెన్ ఆకాశ్ (నిశాంక్ వర్మ) ఆమె జీవితంలోకి అడుగుపెడతారు. తన తండ్రి కలని ఆమె నెరవేర్చిందా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఈ కథ ప్రధానంగా ఆరు పాత్రల చుట్టూ తిరుగుతుంది. చిన్న చిన్న ఫ్లాష్ కట్స్ తో ఈ కథ 1960, 70, 80ల నుంచి 90లలోకి వచ్చి అక్కడ కొనసాగుతుంటుంది. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథ. మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ అనేది లేకుండా ఈ కథ నడుస్తుంది. అతిగా సినిమా టిక్ గా అనిపించే సన్నివేశాలు ఎక్కడా కనిపించవు.
స్క్రీన్ ప్లే నీట్ గా అనిపిస్తుంది. పాత్రలను ప్రవేశ పెట్టిన తీరు .. వాటిని నడిపించిన విధానం .. ముగించిన పద్ధతి సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంటుంది. ఆత్మాభిమానం, అహంభావం అంటూ పెద్దల మధ్య జరిగే గొడవల్లో పిల్లలు మానసికంగా ఎంతగా దెబ్బతింటారనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలలో పెద్దలు జోక్యం చేసుకోవడం వలన, అవి మరింత పెద్దవిగా ఎలా మారతాయనేది చూపించిన విధానం బాగుంది.
కుటుంబ భాద్యతలని తీసుకున్న శిరి పాత్ర అందరికి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా తన డ్రీమ్ కోసం తను పడే తపన అందరిని కట్టిపడేస్తుంది. అడల్ట్ సీన్స్ లేవు. అశ్లీల పదాలు వాడలేదు. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఈ సిరీస్ ని మలిచారు దర్శకులు. శుభంకర్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. దిప్తార్క్ బోస్ నేపథ్య సంగీతం బాగుంది. బోధాదిత్య ఎడిటింగ్ వర్క్ నీట్ గా ఉంది.
నటీనటుల పనితీరు:
శిరి పాత్రలో దివ్యాంక త్రిపాఠి ఒదిగిపోయింది. ఈ సిరీస్ మొత్తంలో ఆమె నటిస్తున్నట్టుగా అనిపించదు.. అంత సహజంగా చేసింది. ఇక మిగతావారు వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా : ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్ ఇది. మస్ట్ వాచెబుల్.
రేటింగ్ : 2.75 / 5
✍️. దాసరి మల్లేశ్