English | Telugu

"పాటలు బాగుంటే ఫంక్షన్ అక్కర్లేదు" - నాగ్

"పాటలు బాగుంటే ఫంక్షన్ అక్కర్లేదు" అని నాగ్ అన్నారట. వివరాల్లోకి వెళితే ఈ మధ్య "రాజన్న" సినిమా గురించి మాట్లాడుతూ "మామూలుగా మనం తీసిన సినిమాలో పాటలు బాగుంటే దానికి ఆడియో ఫంక్షన్ పెట్టటం, ఆ ఫంక్షన్ లో ఒకరిని మరొకరు పొగడటం వంటివి అక్కరలేదు. నిజానికి పాటలే జనాన్ని థియేటర్ కి తీసుకొస్తాయి. "రాజన్న" పాటలు బాగున్నాయి. అందుకే ఆడియో ఫంక్షన్ పెట్టకుండా డైరెక్టుగా మార్కెట్లోకి రిలీజ్ చేశాం. "రాజన్న" ఆడియోకి" మంచి రెస్పాన్స్ వచ్చింది.

అందుకని పాటలు బాగుంటే ఫంక్షన్ అక్కర్లేదు" అని హీరో యువసామ్రాట్, కింగ్ నాగార్జున అన్నారట. అయితే ఇక మీద కింగ్ నాగార్జున సినిమాలకు ఆడియో ఫంక్షన్ లు ఉండవేమో. ఎందుకంటే ఆయన సినిమాల్లో పాటలు ఎలాగూ బాగానే ఉంటాయి కదా...! అయినా "రాజన్న" చిత్రం మంచి హిట్టయ్యి, ప్రేక్షాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.