English | Telugu

విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్!

ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్. 'సీతారామం' సినిమాలో సీతగా ఆమె అభినయానికి, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే తెలుగు ఫిల్మ్ మేకర్స్ దృష్టి ఆమెపై పడింది. ఇప్పటికే ఆమె 'నాని 30' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ పెట్ల రెండోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు ఇటీవల ప్రముఖంగా వినిపించింది. అయితే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చింది. విజయ్ కెరీర్ లో 13వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ పేరుని ఖరారు చేసినట్లు సమాచారం.

విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు విజయ్ తన 12వ సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.