English | Telugu

డిసెంబర్‌లో సినిమాల జాతర.. మూవీ లవర్స్‌కి ఇక పండగే!

2025 సంవత్సరంలో స్టార్‌ హీరోల భారీ సినిమాలు, అప్‌కమింగ్‌ హీరోల డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీస్‌ ఎన్నో వచ్చాయి. అందులో పెద్ద హీరోల సినిమాలే కాదు, చిన్న హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. భారీ సినిమాలు కలెక్షన్ల పరంగా స్టామినా చూపించగా, చిన్న సినిమాలు ప్రేక్షకుల మనసుకు హత్తుకునే స్థాయిలో పెర్‌ఫార్మ్‌ చేశాయి. ఈ ఏడాది చివరి నెలకు వచ్చేశాం. డిసెంబర్‌ నెలలో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కొన్ని సినిమాలు రాబోతున్నాయి. అయితే ఈ నెలలో విడుదలయ్యే సినిమాలు డిఫరెంట్‌ జోనర్స్‌లో రూపొందించబడ్డాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవతార్‌ 3' కూడా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాతోపాటు తెలుగు సినిమాలు కూడా రిలీజ్‌ అవుతున్నాయి.

ఈ నెలలో రిలీజ్‌ అయ్యే తెలుగు సినిమాల్లో 'అఖండ2 తాండవం' చిత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ సాధించింది. ఇప్పుడు వీరిద్దరూ 'అఖండ2'తో రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. డిసెంబర్‌ 5న విడుదలవుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా వారికి ఒక కొత్త అనుభూతిని కలిగించాయి. డిసెంబర్‌ నెలలో థియేటర్లలోకి రాబోతున్న మొదటి సినిమా ఇదే కావడంతో మూవీ లవర్స్‌ ఈ సినిమా కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

ఇక రెండో వారంలో రోషన్‌ కనకాల, సందీప్‌ రాజ్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'మోగ్లీ' విడుదల కాబోతోంది. డిసెంబర్‌ 12న విడుదల కానున్న ఈ సినిమాలో సాక్షి సాగర్‌ మడోల్కర్‌ హీరోయిన్‌గా నటించింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అదే రోజు మరో యంగ్‌ హీరో రామ్‌కిరణ్‌ చేసిన 'సుకుటుంబానాం సైతం' కూడా రిలీజ్‌ అవుతోంది. టైటిల్‌ని బట్టి చూస్తే ఇది ఒక కుటుంబ కథా చిత్రంగా కనిపిస్తోంది.

ఇటీవలి కాలంలో ఆది సాయికుమార్‌ నటించిన సినిమాలేవీ ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. తాజాగా అతను చేసిన సినిమా 'శంబాల'. యుగంధర్‌ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ అతీంద్రియ శక్తులు, సైన్స్‌ నేపథ్యంలో ఉంటుంది. ప్రేక్షకుల్ని ఒక కొత్తలోకంలోకి తీసుకెళ్లే స్టఫ్‌తో వస్తున్న ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసే అవకాశం ఉంది. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటించిన సినిమా 'ఛాంపియన్‌'. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా డిసెంబర్‌ 25నే విడుదల కాబోతోంది. అదే రోజు శివాజీ, నవదీప్‌, బిందుమాధవి నటించిన 'దండోరా' మూవీ కూడా రిలీజ్‌ కానుంది.

డిసెంబర్‌ నెలలో తెలుగు సినిమాలతో పాటు రిలీజ్‌ అవుతున్న హాలీవుడ్‌ సినిమా 'అవతార్‌.. ఫైర్‌ అండ్‌ యాష్‌'. డిసెంబర్‌ 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అవతార్‌ సిరీస్‌లో రెండు భాగాలు విడుదలై ఘనవిజయం సాధించాయి. ప్రేక్షకుల్ని ఒక కొత్తలోకంలోకి తీసుకెళ్లేందుకు వస్తున్న ఈ సినిమా మూవీ లవర్స్‌కి ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం