Read more!

English | Telugu

మదర్స్ డే స్పెషల్ సాంగ్స్..!

అమ్మ..రెండక్షరాలు అమృతం. దేవుడు సృష్టించిన జీవులన్నింటిలోనూ, ఏ విషయంలోనైనా భేదాలుండచ్చు కానీ, అమ్మ ప్రేమలో వ్యత్యాసం ఉండదు. మనిషి నుంచి మృగం వరకూ, పిల్లల్ని సాకడంలో మాత్రం మాతృమూర్తికి తిరుగులేదు. తొమ్మిది నెలల పాటు తన శరీరంలో బిడ్డను కాపాడుకున్న తల్లికి, తొంభై ఏళ్లు దాటినా ఆ బిడ్డ పసివాడిగానే కనిపిస్తాడు. అమ్మదనంలోని కమ్మదనం అది. ఒక్క మాతృమూర్తికి మాత్రమే ఉండే అద్భుత భావన అది. ఎన్ని యుగాలు గడిచినా, కాలాలు మారినా, మారిపోనిది, మచ్చ లేనిది అమ్మ ప్రేమ. మే 06న మదర్స్ డే. అమ్మకు ఒక రోజేంటి..మన జీవితంలో అన్ని రోజుల్నీ రాసిచ్చేసినా సరిపోవు. అయినా ఒక రోజంటూ ఉంది కాబట్టి, ఈ సందర్భంగా మన తెలుగు సినీ వినీలాకాశంలో ఉన్న అమ్మ పాటల్లో మచ్చుకు కొన్ని పాటల్ని చూద్దామా..


1. అమ్మను మించి దైవమున్నదా..(20 వ శతాబ్దం)


2. అమ్మంటే ప్రేమకు రూపం..(బంగారు కుటుంబం)


3. పెదవే పలికే మాటల్లోనే..(నాని)


4. నీవే నీవే (అమ్మ నాన్న తమిళమ్మాయి)

5. ఎవరు రాయగలరు (అమ్మ రాజీనామా)


6. కంటేనే అమ్మ అని అంటే ఎలా..(ప్రేమించు)