English | Telugu

రోజుకొక్కసారైనా అతనితో మాట్లాడకపోతే తోచదు..అయ్యప్పస్వామి భక్తుణ్ని కద

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(MOhanlal)ప్రస్తుతం 'తుడురం'(Thudarum)అనే మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 25 న రిలీజైన ఈ థ్రిల్లర్ డ్రామా తెలుగులో కూడా హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. మోహన్ లాల్ సరసన సీనియర్ నటీమణి శోభన(shobana)జత కట్టగా తరుణ్ మూర్తి(tharun moorthy)దర్శకత్వంలో ఎం రెంజిత్ నిర్మించాడు.

తాజాగా మోహన్ లాల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నలభై ఎనిమిదేళ్ల సినీ కెరీర్‌లో నేను సినిమాను ప్రేమించినంతగా దేన్నీ ప్రేమించలేదు. విశ్రాంతి తీసుకోవడం, ఖాళీగా ఉండటమంటే నచ్చదు. ఈ కారణంతోనే ఒక సినిమా సెట్స్‌ మీద ఉండగానే నాలుగైదు చిత్రాలకు ఓకే చెబుతుంటాను. మమ్ముట్టి(Mammootty)నా ప్రాణస్నేహితుడు. రోజుకి ఒక్కసారైనా తనతో మాట్లాడనిదే నాకు తోచదు. మా మధ్య పోటీ ఉందని అనుకుంటు ఉంటారు. కానీ మా మధ్య అంతకంటే మంచి స్నేహం ఉంది. తనతో కలిసి ఇప్పటి వరకు యాభై సినిమాల దాకా చేశాను. ఇంకా మరిన్ని చిత్రాల్లో కలిసి పని చేయాలనేదే నా కోరిక.

అయ్యప్ప స్వామి(Ayyappaswami)భక్తుణ్ని, అప్పుడప్పుడు మాల వేసుకుని కాలినడకన శబరిమల వెళ్లి ఇరుముడి సమర్పించి వస్తుంటా'అని మోహన్ లాల్ తెలిపారు. మోహన్ లాల్ గత నెల మార్చి 27 న 'ఎల్ 2 ఎంపురాన్ 'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు ఒక వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీయడంతో ఆయా వర్గాల వారికి మోహన్ లాల్ క్షమాపణలు కూడా చెప్పాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.