English | Telugu
మోహన్ బాబు,విష్ణుల గన్స్ స్వాధీనం..బౌన్సర్ల బైండోవర్
Updated : Dec 10, 2024
మోహన్ బాబు(mohan babu)మనోజ్(manoj)మధ్య గత రెండు రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.విష్ణు రాకతో ఈ గొడవ మరింతగా ముదిరిందని చెప్పవచ్చు.ఇందుకు నిదర్శనంగా నిన్న మనోజ్ ఇంటి గేట్ పగలకొట్టి లోపలకి వెళ్లడం.ఆ తర్వాత చినిగిన చొక్కాతో బయటకి రావడం కూడా జరిగింది.ఇక ఈ విషయాన్నీ కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధిని మోహన్ బాబు కొట్టడంతో ప్రస్తుతం సదరు మీడియా ప్రతినిధి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.దీంతో మోహన్ బాబు ని అరెస్ట్ చెయ్యాలనే డిమాండ్ ని మీడియా ప్రతినిధులు తెర మీదకి తీసుకొస్తున్నారు.పోలీసులు కూడా ఈ సంఘటనలో సీరియస్ గా ఉన్నారు.
దీంతో మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్ల ను బైండోవర్ చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.అదే విధంగా మోహన్ బాబు,విష్ణు దగ్గర ఉన్న గన్స్ ని కూడా కోర్టు లో డిపాజిట్ చేయాలని అదేశాలు జారీ చేసింది. ఈ రోజు ఉదయం మోహన్ బాబు కోర్టు లో హాజరు కావడంతో పాటు లక్షరూపాయలు ని బాండ్ రూపంలో ఇవ్వాలని కూడా డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ అండ్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది.