Read more!

English | Telugu

బాలీవుడ్ నటి మినీషా లాంబా అరెస్ట్

బాలీవుడ్ నటి మినీషా లాంబా అరెస్ట్ అయ్యింది. వివరాల్లోకి వెళితే బాలీవుడ్ నటి మినీషా లాంబాని ముంబాయ్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. మినీషా లాంబా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ నుండి ఇండియా తిరిగి వస్తూండగా, ఆమె వద్ద 50 లక్షల విలువగల ఆభరణాలు అనధికారికంగా ఉండటంతో ఆమెను ముంబాయ్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అంతే కాక ఫ్రాన్స్ లోని నైస్ ఎయిర్ పోర్ట్ లో మినీషా లాంబా బ్యాగ్ ఒకటి మిస్సయిందట. ఆ బ్యాగ్ కోసం ఎమిరేట్స్ లో క్లోజ్ డ్ సర్క్యూట్ కెమెరాలలో చెక్ చేస్తూ, మినీషా లాంబా పోయిన బ్యాగ్ గురించి దాదాపు గంటసేపు వెతికారట అక్కడి అధికారులు, పోలీసులు. కానీ ఆ బ్యాగ్ ఏమయ్యిందో, ఎక్కడుందో తెలియలేదట.

ఇంతకీ ఆ బ్యాగ్ దొంగిలించబడిందా...? లేక ఎక్కడయినా పొరపాటున వేరే ప్రదేశానికి వెళ్ళిందా అనే వివరాలు కూడా తెలియలేదట. ఆ పోలీసులతో పోలిస్తే మన పోలీసులే ఎంతో బెటరని అంటోంది మినీషా లాంబా... అది సరే మినీషా లాంబా తన బ్యాగ్ పోయిందే అని మొత్తుకుంటుందే కానీ, తనని అరెస్ట్ చేసిన విషయం గురించి ఆమె పెద్దగా మాట్లాడటం లేదు... అదంత పట్టించుకోవలసిన విషయం కాదనుకుందేమో మరి...