English | Telugu

సైలెంట్ గా ఓటీటీలోకి 'మేమ్ ఫేమస్'!

యూట్యూబర్ సుమంత్‌ ప్రభాస్‌ ను హీరోగా, దర్శకుడిగా పరిచయం చేస్తూ ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం 'మేమ్ ఫేమస్'. ఎందరో కొత్తవాళ్లు పనిచేసిన ఈ సినిమా ఈ ఏడాది మే 26న థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా యూత్ ని ఈ సినిమా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

'మేమ్ ఫేమస్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంది. అయితే పెద్దగా ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది 'మేమ్ ఫేమస్'. ఈరోజు(జూన్ 30) నుంచి ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ దక్కించుకొని బయ్యర్లకు లాభాలను మిగిల్చిన మేమ్ ఫేమస్.. ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణ పొందుతుందేమో చూడాలి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.